-సంఘీభావం తెలిపిన టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు కాడే చెంచయ్య నాయుడు
సిద్ధవటం,ఫ్రిబ్రవరి 4 (ఎల్లో సింగం న్యూస్)
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన అభిమాన నాయకుడిపై ఉన్న నమ్మకాన్ని చాటుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కష్ట కాలం నుంచి బయటపడి తిరిగి సీఎం కావాలని గతంలో తిరుమల, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. సంకల్ప యాత్ర బుధవారం సిద్ధవటం మండలంలోని భాకరాపేటకు చేరుకోవడంతో రాజంపేట నియోజకవర్గ టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు కాడే చెంచయ్య నాయుడు ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ పాలనలో అప్పటి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టి జైల్లో ఉంచారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కేసు నుంచి విముక్తి కాగానే తిరుమల తిరుపతికి పాదయాత్ర చేపడతానన్నారు. ఇటీవల విజయవాడ కోర్టు సీఎం చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసును కొట్టివేయడంతో తన ఇంటి నుంచి తిరుమల,తిరుపతికి పాదయాత్ర చేపట్టామన్నారు.ఇది రాజకీయ యాత్ర కాదని, తన మనోవేదన తీర్చిన దేవుడికి చెల్లించే భక్తి యాత్ర మాత్రమేనని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ సెక్రటరీ కదిరేగారి శ్రీనివాసులు నాయుడు, ఓబులేసు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
