‘ప్రశ్న మీది.. గొంతు నాది’.. ఏలూరు ఎంపీ వినూత్న కార్యక్రమం

ప్రజల సమస్యలను నేరుగా పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లేలా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ప్రశ్న మీది.. గొంతు నాది’ పేరిట ప్రారంభించిన ఈ కార్యక్రమంలో, నియోజకవర్గ ప్రజలు తమ ప్రాంత సమస్యలను వాట్సప్‌ ద్వారా పంపవచ్చని తెలిపారు. ఎంపికైన ప్రశ్నలను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రజల తరఫున ప్రస్తావిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ప్రశ్నలు పంపిన వారిని పార్లమెంట్ సందర్శనకు ఆహ్వానించి సందర్శకుల గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe