ప్రభుత్వ బడులను కాపాడుకుందాం-ఉపాధ్యాయులకు,సమాజానికి యుటిఎఫ్ పిలుపు.

పెనగలూరు(ఫిబ్రవరి 02), ఎల్లో సింగం ప్రతినిధి :

“ప్రభుత్వ బడి లో విద్యార్థులను చేర్పిద్దాం-ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకుందాం ” అని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) సంఘం పిలుపునిచ్చారు. సోమవారం ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కరపత్రాలు, పోస్టర్స్ ను పెనగలూరు మండలం చక్రంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విడుదల చేసారు. 2026-27 నూతన విద్యా సంవత్సరానికి గాను ముందస్తుగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యాచరణ ను ఈ ఫిబ్రవరి నెలలోనే ప్రారంభించాలని ఉపాధ్యాయులను కోరినట్లు చెప్పారు. తల్లిదండ్రులు, సమాజం వద్దకు వెళ్లి ప్రభుత్వ బడి ఆవశ్యకత ను తెలిపి వారికి విద్యపై భరోసా, నమ్మకాన్ని కల్పించే పని చేయాలని సూచించారు. ప్రభుత్వ బడులు బలహీనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. సమాజ అవసరాలు తీర్చగలిగిన వనరులు, నైతిక విలువలు, దేశభక్తి, సమానత్వ భావన ప్రభుత్వ బడుల ద్వారా సాధ్యమని పేర్కొన్నారు.సమాజం లోని అన్ని వర్గాల వారు ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు లేబాకు. గోపాల కృష్ణ, యుటిఎఫ్ రాష్ర్టనాయకులు బి. హరి ప్రసాద్, పెనగలూరు మండల అధ్యక్షులు పి. శ్రీనివాస కుమార్, ప్రధాన కార్యదర్శి యం. నరసింహారావు, సహాధ్యక్షురాలు జి. వాణి, ట్రెజరర్ యస్. నజీమ్, మహిళా కన్వీనర్ డి. పద్మశ్రీ, ఆడిట్ కన్వీనర్ జె. సురేంద్ర,క్లస్టర్ కన్వీనర్ యన్. గిరి, ఉపాధ్యాయులు అన్వర్ బాష, మహేంద్ర, సుదర్శన్, ప్రసాద్, శివ నరసింహులు,సతీష్, క్రిష్ణ కుమారి, ప్రమీల, శ్రీవాణి, పరిమళ,దేవమణి, శ్రీదేవి, షబానా, అరుణ, హసనయ్య, బాదుషా తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe