శ్రీశైలం, జనవరి, 9.
( ఎల్లో సింగం ప్రతినిధి )
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. శుక్రవారం వేల్పనూరు నందు నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో సమస్యలపై ప్రజలు ఇచ్చిన పలు వినతులు స్వీకరించారు. సమస్యల గురించి అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడికక్కడే పలు సమస్యలకు పరిష్కారం చేపట్టారు. మరికొన్ని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు,
WhatsApp
Join Now
Youtube
Subscribe
