ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించండి

తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టండి

-*మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .

*ఆర్.డబ్ల్యూ.ఎస్, పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశం.

విజయవాడ రూరల్, ఎల్లో సింగం రిపోర్టార్.

పల్లెల్లో ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి, వారి సమస్యలను పరిష్కరించాలని, జవాబుదారీతనంతో వ్యవహరించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అధికారులకు నిర్దేశించారు.
విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయితీ రాజ్ అధికారులు, ఎంపీడీవోలు, గ్రామ పంచాయితీ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో గ్రామపంచాయతీల బాధ్యత ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధిదీపాలు ఏర్పాటు, రహదారి సౌకర్యాలను మెరుగు పరచడానికి ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టాలని అన్నారు.
రానున్న వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాకు కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలు ముందుగానే గుర్తించి ప్రణాళిక బద్ధంగా పనులు చేపట్టాలని అన్నారు. తాగునీటి పైపులైన్ల నిర్వహణ సమర్ధవంతంగా ఉండాలని అన్నారు.
పల్లెపండుగ 2.0లో భాగంగా శంకుస్థాపన చేసిన సిమెంట్ రహదారులు, ఇతరత్రా పనులు సాధ్యమైనంత త్వరగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయించాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందింస్తూ ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe