ప్రజా సంక్షేమం కూటమి బాధ్యత,,,హింసాత్మకధోరణి వైసీపీ నైజం – ఎమ్మెల్యే కొండయ్య

భూపట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో వైసీపీ తీరుని ఎండగట్టిన వైనం .

గత వైసీపీ సర్కార్ పనితీరుతో ప్రజాధనం వృధా.

చీరాల ఎమ్మెల్యే MM కొండయ్య గత వైసీపీ ప్రభుత్వ పని తీరు,మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చీరాల – పేరాలలో భూ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన స్థానిక ఎమ్మెల్యే MM కొండయ్య పలువురు రైతులకు రాజముద్రతో కూడిన భూ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.ఇక ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే MM కొండయ్య మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే తత్వం కూటమి ప్రభుత్వానిదేయితే ,హింసాత్మకధోరణి వైసీపీ పార్టీ నైజం అన్ని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో భూసర్వే లని తప్పుడు తడకలైనన్నారు.ఆఖరికి భూసర్వే రాళ్ళను మొదలుకొని పట్టాదారుణి పాసుపుస్తకాల వరకు జగన్ వ్యక్తిగత బొమ్మలేనాని ఎద్దేవా చేశారు. ప్రజల సొంత పొలాలు,భూములకు సంబంధించిన పాస్ పుస్తకాల పై జగన్ వ్యక్తిగత బొమ్మ ఎంతవరకు సరైన పద్ధతి అన్ని ప్రశ్నించిన ఆయన ,,దీని అర్థం శాశ్వితంగా అధికారంలో ఉంటాననే అహంకారం కదా..! అన్నారు.పాసుపుస్తకాల మార్పుతో లక్షల రూపాయల ప్రజాధనం వృద్ద అవుతుందన్నారు,,,ప్రజాధనం వృద్ధకు కేవలం వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ఇక ఇదే క్రమంలో సాధారణంగా భగవంతునికి,మంచి పని చేసిన వ్యక్తుల చిత్రపటాలకు పాలవిషేకం చేస్తాం…కానీ 2029 ఎన్నికలలో YCP కనుక 80 సీట్లు దాటితే గంగమ్మ జాతరలో పొట్టేల తలలు నరికినట్లు నరుకుతారంట ,,,పై పెచ్చు రక్తంతో జగన్ కు పాలాభిషేకం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని విమర్శించారు. పిచాచులకు మాత్రమే రక్తాభిషేకం చేస్తారనీ,,, జగన్ కూడా పిచాచి కాబట్టే ఆయన అభిమానులు రక్తాభిషేకం చేస్తున్నారన్నారు.సమాజానికి వైసీపీ నేతలు,కార్యకర్తలు ఎప్పటికైనా ప్రమాదమేనన్నారు. అయితే ప్రజలు అన్ని గమనిస్తున్నారని ,,రానున్న ఎన్నికలలో సైతం ప్రజలు కూటమి ప్రభుత్వానికి నైతిక మద్దతుగా నిలవాలని కోరేరు.

WhatsApp Join Now
Youtube Subscribe