ప్రజా ప్రతినిధులే ప్రభుత్వ అధికారులు

గ్రామ సభకు సగానికి పైగా డొమ్మా కొట్టిన సిబ్బంది

సభలో కానరాని సచివాలయ సిబ్బంది

కొత్తవలస ఎల్లో సింగం ప్రతినిధి జాన్ ఎవరి 5:- శృంగవరపుకోట నియోజకవర్గంలో కొత్తవలస మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సోమవారం ఇంచార్జ్ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభ సచివాలయం 4 పరిధిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పంచాయితీ పరిధిలో పలు ప్రాంతాల నుంచి ప్రజలు హాజరు కాగా ప్రజా ప్రతినిధులు సైతం హాజరయ్యారు ఈ కార్యక్రమం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న పంచాయతీ పరిధిలో ఉన్న ఐదు సచివాలయాల సిబ్బందిలో అరకొర హాజరయ్యారే తప్ప ఇంకెవరు కానరాకపోవడం మండల స్థాయి అధికారులు గృహ నిర్మాణ శాఖ, వెలుగు, ఉపాధి హామీ, వైద్య ఆరోగ్య శాఖ నుండి కొంతమంది ఆశా వర్కర్లు ఐసిడిఎస్ నుండి కొంతమంది హాజరు కాగా మిగతా శాఖల అధికారులు ఎవరూ సభలో లేకపోవడం ప్రజా ప్రతినిధులే ప్రభుత్వ అధికారుల ప్రశ్నోత్తరాలు వేయాల్సి వచ్చింది ఇది ఇలా ఉంటే చింతల దిమ్మ,
కుమ్మరి బంజారు, ప్రాంతాలలో గత కొంతకాలంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు తాగునీరు సమస్య ఎక్కువగా ఉందని ఎన్ని మార్లు పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ప్రజా ప్రతినిధులతో మహిళలు వాగ్వాదానికి దిగారు ఈ సమస్యలు త్వరితగతిన పరిష్కరించకపోతే జిల్లా స్థాయి అధికారులు దృష్టికి సమస్యలు తీసుకెళ్తామని ఆ ప్రాంత మహిళలు అన్నారు

WhatsApp Join Now
Youtube Subscribe