నందలూరు జనవరి 31, (ఎల్లో సింగం ప్రతినిధి)
“ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశమే మాకు శిరోధార్యం. మాట ఇస్తే తప్పని ప్రభుత్వం మనది. పెంచిన పింఛన్లను నెల మొదటి రోజే లబ్ధిదారుల ఇంటి ముంగిటకే చేర్చి, అవ్వాతాతల కళ్లలో ఆనందం చూడటమే మా లక్ష్యం” అని రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దల విజయ సాగర్ స్పష్టం చేశారు.
శనివారం తిరుపతి లక్ష్మీపురం మరియు నందలూరు పరిధిలో జరిగిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, మరియు దివ్యాంగులకు పెంచిన పింఛన్ సొమ్మును అందజేశారు.
మాటే శాసనం – అమలే లక్ష్యం: ఎన్నికల హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచి, ఎక్కడా జాప్యం లేకుండా ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి అందించడం ద్వారా చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని చాటుకున్నారని సాగర్ కొనియాడారు.
నారా లోకేష్ మార్గదర్శకత్వంలో:
యువనేత నారా లోకేష్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి నిరుపేదకూ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం శ్రమిస్తామని ఆయన పేర్కొన్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు:
ఎండనక, వాననక ప్రభుత్వ ప్రతినిధులు తమ ఇంటి వద్దకే వచ్చి గౌరవప్రదంగా పింఛన్ ఇవ్వడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఈ కార్యక్రమంలో నందలూరు గ్రామ సర్పంచ్ రాము, నాయకులు చక్రాల సాయినాథ్, గుండు సురేష్, పల్లె మురళి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు మరియు ఇతర కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
”సంక్షేమం అంటే కేవలం పథకాలు ఇవ్వడం కాదు.. ఆ లబ్ధిదారుడి ఆత్మగౌరవాన్ని కాపాడటం. అదే ‘ఎన్టీఆర్ భరోసా’ ఉద్దేశ్యం.” – ఎద్దల విజయ సాగర్
