బనగానపల్లె, ఫిబ్రవరి, 1.
( ఎల్లో సింగర్ ప్రతినిధి )
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సూచించారు. నేటి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను మంత్రి స్వయంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అన్నారు. బాధితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. న్యాయబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో సంబంధిత అధికారులతో అక్కడిక్కడే ఫోన్ లో మాట్లాడి పరిష్కరించడం జరిగింది. ఎక్కువగా రెవెన్యూ సమస్యలు, ఫించన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వంటి సమస్యలు ఆయన దృష్టికి రాగా ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ అర్జీలు స్వీకరణ కార్యక్రమంలో ఆయా సమస్యలపై మంత్రి స్పందించిన తీరుతో బాధితుల నుంచి ఆనందం వ్యక్తం అవుతుంది. మంత్రి ఆధ్వర్యంలో నిర్వహంచిన ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.
