ప్రజలు అందించిన ప్రతి వినతిని పరిశీలించి పరిష్కరిస్తాం

మున్సిపల్ కార్యాలయం జరిగిన గ్రీవెన్స్ లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

పార్వతీపురం ఎల్లో సింగం ప్రతినిధి:ప్రజలు అందించిన ప్రతి వినతిని పరిశీలించి ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలు అందించిన వినతులను స్వీకరించారు. పార్వతీపురం మున్సిపాలిటీలో గల 30 వార్డుల నుంచి పలు సమస్యలపై ప్రజలు వినతులు అందించారు. ప్రధానంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు మంజూరు చేయాలని, కాలువలు, రోడ్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి పైపులు వేయించాలని ప్రజల కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ఇచ్చే ప్రతి వినతిని పరిశీలించడం జరుగుతుందని, సమస్యను త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 30 వార్డుల్లో ఇప్పటికే 100 పనులకు శంకుస్థాపన చేయడానికి శ్రీకారం చుట్టామని, దశలవారీగా మున్సిపాలిటీలో అన్ని సమస్యలు పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందించడం జరిగిందని అన్నారు. పట్టణంలోని సమస్యల పరిష్కరించడానికి దిశ నిర్దేశం చేయడం జరిగిందని, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి వారు ఇచ్చే దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పావని, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe