ఒడిశా ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పొగాకు ఉత్పత్తులపై కఠిన నిర్ణయం తీసుకుంది. గుట్కా, పాన్‌మసాలా, తంబాకు, జర్దా, ఖైనీ వంటి అన్ని పొగాకు పదార్థాల తయారీ, విక్రయం, నిల్వ, రవాణా, పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా నిషేధించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్‌తో పాటు గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని, వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
WhatsApp
Join Now
Youtube
Subscribe
