శృంగవరపుకోట
స్థానిక పుణ్యక్షేత్రమైన తిరుమలగిరిలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం (ఈరోజు) క్షేత్రంలో అత్యంత విశిష్టమైన ‘కూడారై’ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో పాయస నివేదన:
ధనుర్మాస వ్రతంలో భాగంగా శ్రీవారికి, అమ్మవార్లకు గంగాళాలతో నిండుగా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారికి జరిగిన ఈ విశేష నివేదన భక్తులను పరవశింపజేసింది. అనంతరం భక్తులకు ఆ పాయసాన్ని పాత్రలతో సహా ప్రసాదంగా వితరణ చేశారు
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, సుధారాణి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధనుర్మాస వేళ ఇటువంటి పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టమని, క్షేత్ర అభివృద్ధిలో భక్తులందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఆలయ నిర్వాహకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
