పార్టీ అన్ని గమనిస్తోంది.. ఎవరికీ నష్టం జరగనివ్వదు

అర్బన్ నియోజకవర్గ క్లస్టర్లతో టిడిపి జోన్-5 ఇంచార్జ్ కోవెలమూడి నాని

ఎమ్మెల్యే దగ్గుపాటితో కలిసి విజయవాడలో నానితో భేటి అయిన క్లస్టర్లు

నియోజకవర్గంలో పరిణామాలను నాని దృష్టికి తీసుకెళ్లిన క్లస్టర్లు

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని పరిణామాలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని.. ఎవరికీ ఇబ్బందులు రానివ్వమని జోన్-5 ఇన్ ఛార్జి కోవెలమూడి నాని (రవీంద్ర) అన్నారు. విజయవాడలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ క్లస్టర్లు ఎమ్మెల్యే దగ్గుపాటి కలిసి భేటి అయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, వారి ఇబ్బందులను నాని దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో సమస్యల్ని వివరించారు. అన్ని అంశాలు పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా నాని వ్యాఖ్యానించారు. పార్టీకి, కార్యకర్తలకు ఎలాంటి కష్టం రానివ్వకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటితో నాని ప్రత్యేకంగా భేటి అయి.. పలు అంశాల గురించి చర్చించుకున్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్, టిడిపి సీనియర్ నాయకుడు, జానపద అకాడమీ మాజీ చైర్మన్ పొట్లూరి హరికృష్ణ, క్లస్టర్ ఇంచార్జ్ లు రాజారావు, సాకే లక్ష్మీనరసింహ, కాయగూరల శ్రీధర్, వన్నురప్ప, గోపాల్ గౌడ్, దలవాయి వెంకటనారాయణ, చేపలహరి, కృష్ణం రఘు, పొట్లూరి కేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe