నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామంలో శ్రీ చౌదేశ్వరీదేవీ, శ్రీ మశమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల నూతన ఆలయాలు మరియు విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొని విశేష పూజలు చేశారు. గ్రామదేవతల దీవెనలే దేశాభివృద్ధికి పునాది అని ఆమె పేర్కొన్నారు. బైరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో, వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“పాత ముచ్చుమర్రిలో వైభవంగా గ్రామదేవతల ఆలయాల ప్రతిష్ట – దేశాభివృద్ధికి దీవెనలే పునాది: డాక్టర్ బైరెడ్డి శబరి”
20
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
