పాడి రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర తెదేపా మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాత సురేష్ అన్నారు.లావేరు మండలం తాళ్ళవలస లో మంగళవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని ఆమె కూటమి నాయకులు తో కలిసి ప్రారంభించారు.
ఉచిత పశు ఆరోగ్య శిబిరాల గోడ, కర పత్రాలను
ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
పాడి రంగంలో అభివృద్ధి సాధించాలంటే పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నారు. తద్వారా ఉత్పాదకత పెరిగి రైతు ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ
పథకంలో భాగంగా పశు పోషకులకు నాణ్యమైన వైద్య సేవలు,వ్యాధి నివారణ, అవగాహన కార్యక్రమాలు ఉచితంగా అందిస్తారన్నారు. గర్భకోశ వ్యాధులకు చికిత్స, నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు,శాస్త్రీ త్రయ పశు పోషణపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.
పశువుల ఆరోగ్యం కాపాడడం, రైతులకు వైద్య ఖర్చుల భారం
తగ్గించడం, ఉత్పాదకతను పెంచడమే ఉచిత పశు ఆరోగ్య
శిబిరాలు ముఖ్య ఉద్దేశమన్నారు.ఈకార్యక్రమంలో,ఆధికారులు సచివాలయా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
పాడి రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
20
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
