పాడి పరిశ్రమల అభివృద్దే లక్ష్యంగా గోకులాల నిర్మాణం..

పాడి, పంటల అభివృద్దే దేశాభివృద్ధి…

గోకులం పథకం కింద షెడ్ల నిర్మాణానికి పశువుల పెంపకందార్లకు 90శాతం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందార్లకు 70 శాతం చొప్పున రాయితీలు..

ఉపాధి హామీ పథకం కింద రాయితీ..
పశుపోషకుల్లో ఆనందం..

రూ.2 లక్షలతో నిర్మించనున్న గోకులానికి భూమి పూజ చేసిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు అన్నారు. గిద్దలూరు మండలం, కంచిపల్లె పంచాయతీ, రాజుపేట గ్రామంలో కాకర్ల రంగయ్య అనే రైతు “VB G RAM G” ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 2 లక్షలతో నిర్మించనున్న గోకులం షెడ్డు భూమి పూజ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరై గోకులం షెడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, గత వైసీపీ పరిపాలనలో గోకులం షెడ్లను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడంతో వాటికి పూర్వవైభవం తెచ్చేందుకు అడుగులు వేస్తోందన్నారు. గ్రామాల్లో పశుపోషణ, కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ, పెంపకందార్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పశువుల నివాసానికి కొద్దిపాటి స్థలం ఉంటే మినీగోకులం పేరిట షెడ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. పాడి రైతులు అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 90 శాతం సబ్సిటీ తో ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని ఆర్హులైన ప్రతి ఒక్క పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పశువుల షెడ్ల నిర్మాణానికి రైతులు సహకరించి తద్వారా పశువుల పెంపకం అభివృద్దితో దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. పశు సంవర్ధక శాఖ మరియు జాతీయ లైఫ్ స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో ఔత్సాహిక రైతులకు, పశువుల పెంపకం దారులకు నిరుద్యోగులకు ప్రోత్సాహంగా ప్రభుత్వము అనేక రుణాలు అందజేస్తుందన్నారు. వీటిని ప్రతీ ఒక్క పశువుల పెంపకం రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సన్న ,చిన్నకారు రైతులు రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆర్ధిక రుణాలను అంది పుచ్చుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి రుణాల పై అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సన్న, చిన్న, కారు రైతులకు ప్రోత్సాహకరమైన ఋణాలు అందుబాటులో ఉన్నాయి అని వాటిపై అవగహన పెంచుకొని ఋణాలను పొందాలని తద్వారా వ్యాపారాభివృద్ధి చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని రైతులకు పిలుపు నిచ్చారు. రైతులకు, ఋణాల పై అవగహన మరియు వాటి లబ్ధిపై, వాటిని పొందే విధానంపై బ్యాంకర్స్, మరియు, అగ్రికల్చర్, ఇతర ప్రభుత్వ అధికారులు కలిసి ప్రతీ నెల ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు, ముఖ్యంగా పశువుల పెంపకం దారులకు ఋణాలను అందించే భాద్యత మీ పై ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశించారు. అలాగే ఆధునిక ప్రపంచంలో వ్యాపారంలో పోటీ పడాలంటే ఆధునిక టెక్నాలజీ జోడించి వ్యాపారం చేస్తే ఆర్ధిక ఫలాలు లాభాలు అంది పుచ్చుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, ఎంపీడీఓ సీతారామయ్య, APO శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ బుడతా మధుసూదన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, స్థానిక నాయకులు దప్పిలి శ్రీనివాసరెడ్డి, సూర్య నారాయణ రెడ్డి, మండల నాయకులు నంది శ్రీను, సొసైటీ బ్యాంకు చైర్మన్ ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య, మరియు సర్పంచులు మాజీ సర్పంచులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe