జిల్లా పర్యాటక రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం
నేడు మహాలొద్ద జలపాతం ప్రారంభోత్సవం
విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది వెల్లడి
బొబ్బిలి బ్యూరో ఎల్లో సింగం ప్రతినిధి:-
ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కే జలపాతాలకు నిలయమైన మన్యం జిల్లా పర్యాటక రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది వెల్లడించారు. మహాలొద్ద జలపాతం ప్రారంభోత్సవంపై బుధవారం కలెక్టర్ చాంబర్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే అత్యంత ఎత్తన, ఆకర్షణీయమైన జలపాతాల్లో ఒకటిగా పేరుగాంచిన ‘మహాలొద్ద’ జలపాతాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం అధికారికంగా ప్రారంభించను న్నట్లు పేర్కొన్నారు.ట్రెక్కింగ్ చేసే సాహసి కులకు, ప్రకృతి ప్రేమికులకు మరియు అడ్వెంచర్ పర్యాటకులకు ఈ జలపాతం సరికొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు. సాహస యాత్రికులకు ఇది స్వర్గధామమని అన్నారు.స్థానిక గిరిజనుల ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ డ్రివెన్ టూరిజం’ పద్ధతిలో ఇక్కడ సౌకర్యాలు కల్పించడం జరిగిందని, దీనివల్ల స్థానిక గిరిజన యువ తకు ఉపాధి అవకాశాలు మెరుగుపడను న్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వివ రించారు.పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ ఒక అధునాతన గెస్ట్ హౌస్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పా రు. ప్రారంభోత్సవం సందర్భంగా నందా గ్రా మం నుంచి యువత భారీ బైక్ ర్యాలీతో జలపాతం వద్దకు చేరుకోనుందని, పర్యా టకుల కోసం స్థానికంగా జీపులను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని ఇతర జలపాతాలకు తలమానికంగా నిలిచే ఈ మహాలొద్ద జల పాతాన్ని పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు సందర్శించి ఆనందించాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు…
