రుద్రవరం జనవరి,16,
( ఎల్లో సింగం ప్రతినిధి )
మండల కేంద్రం రుద్రవరంలో వెలసిన
శ్రీ భాస్కర నందీశ్వర స్వామి మరియు శ్రీ రమా సత్యనారాయణ స్వామి వార్ల పార్వేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా యువకులకు పరుగు పందెం పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. రెండు విడతలుగా జరిగిన ఈ పోటీలలో, మొదటి విడతలో 11 మంది యువకులు పాల్గొనగా బోయలకుంట్ల ప్రతాప్ విజేతగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం జరిగిన రెండవ విడత పందెంలో 18 మంది పోటీ పడగా, పోలా నందు వేగంగా పరుగెత్తి విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజేతలకు ఆలయ కమిటీ వారు బహుమతులను ప్రదానం చేశారు. మొదటి బహుమతిని శ్రీ భాస్కర నందీశ్వర స్వామి దేవస్థానం తరఫున, రెండవ బహుమతిని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానం తరఫున అందజేశారు. ఈ ఉత్సవంలో ఆలయ నిర్వాహకులు ఏరువాకిష్టమూర్తి, గంగిశెట్టి రమేష్ గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు.
