సంపూర్ణ పారిశుధ్యానికై అందరూ భాగస్వాములు కావాలి: ఎన్.సి.డి పిఓ డాక్టర్ జగన్ మోహన్
పార్వతీపురం ఎల్లో సింగం ప్రతినిధి: వ్యాదులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచూసుకోవాలని,సంపూర్ణ పారిశుధ్యానికి అందరూ భాగస్వాములై సమష్టి కృషి చేయాలని జిల్లా ఎన్.సి.డి అధికారి, స్వచ్ఛఆంధ్ర నోడల్ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు పేర్కొన్నారు. పెదబొండపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి పిహెచ్సి ఆవరణను శుభ్రపరిచారు. ప్రాంగణంలో ఉన్న మొక్కలకు నీరు పోశారు.పిహెచ్సీ లో బయో వ్యర్థాల నిర్వహణ తీరు పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ జగన్ మోహన్ మాట్లాడుతూ అపరిశుభ్రతో వ్యాదులు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయో అవగాహన కల్పించాలని, అలాగే బహిరంగ మల,మూత్ర విసర్జన వల్ల కలిగే దుష్ప్రభావాలు,మరుగు దొడ్లు వినియోగంపై అవగాహన పెంపొందించాలన్నారు.డ్రైడే అందరూ పాటించాలన్నారు. గ్రీన్ అంబాసిడర్ లకు ప్రతీ నెలా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. ధరణి, డా. గోపాల్, ఎపిడెమిక్ ఈఓ వాసుదేవరావు, సూపర్వైజర్స్ వెంకటనాయుడు,జయలక్ష్మీ,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
