మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ బీచ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన కోటి 8 లక్షల శివలింగాలకు గంట్ల శ్రీనుబాబు దంపతులు ప్రత్యేక జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆనందమయ జీవనం గడపాలని తాను కోరుకున్నట్లు గంట్ల శ్రీనుబాబు తెలిపారు.
రాజ్యసభ మాజీ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్తర కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. గడచిన 41 ఏళ్లుగా విశాఖలో కోటి శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించడం, భక్తులే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించడం విశేషమన్నారు. అనంతరం కాకినాడ యజ్ఞ పీఠాధిపతి ఏర్పాటు చేసిన దేవతామూర్తులను దర్శించుకున్నారు.
ఈశ్వరుడి కృప సర్వలోకానికీ శాంతి, సౌఖ్యాలను ప్రసాదిస్తుందని, స్వామి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. ప్రతి ఏటా ఇక్కడ శివదర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
