దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈసారి జేఈఈ మెయిన్స్‌కు రికార్డు స్థాయిలో 14.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1.50 లక్షల మంది పరీక్షకు నమోదు చేసుకున్నారు. జేఈఈ మెయిన్స్ నిర్వహణ కోసం తెలంగాణలో 14 ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో 30 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఏపీలో ఎన్టీఏ 8 అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 గంటలకు తొలి సెషన్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
