నెహ్రూ నగర్‌లో ఆర్‌సీసీ డ్రెయిన్‌కు ఘన ప్రారంభోత్సవం.

నందిగామ ఎల్లో సింగం రిపోర్టార్

రూ.77.50 లక్షలతో సీఆర్‌డీఏ నిధుల ద్వారా శాశ్వత డ్రైనేజీ సమస్యకు పరిష్కారం.
నందిగామ పట్టణం 14వ వార్డు నెహ్రూ నగర్ ఆర్చి వద్ద రూ.77 లక్షల 50 వేల వ్యయంతో సీఆర్‌డీఏ నిధుల ద్వారా నిర్మించిన ఆర్‌సీసీ డ్రెయిన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి తో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, నందిగామ పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే దిశగా భారీ నిధులతో నాణ్యమైన పనులు చేపడుతున్నామని అన్నారు. నెహ్రూ నగర్ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యలు ఈ ఆర్‌సీసీ డ్రెయిన్ నిర్మాణంతో పూర్తిగా తొలగిపోయాయని ఆమె పేర్కొన్నారు. వర్షాకాలంలో మురుగు నీరు నిలిచి ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఇకపై ఉండవని, ఆరోగ్య పరిరక్షణకు ఈ డ్రెయిన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, ఎంతోకాలంగా తమను వేధిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందుకు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారికి, కూటమి ప్రభుత్వానికి హర్షధ్వానాలతో ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి పనులు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొస్తున్నాయని వారు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe