పాల్గొన్న జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ చౌదరి ప్రత్యేక హాజరు
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీ చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ
అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగుల గుడ్డం తండాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ చౌదరి, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణ శ్రీ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి, గ్రామస్తుల నుంచి పలు వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
