నందలూరు జనవరి 31,(ఎల్లో సింగం ప్రతినిధి)
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలో శనివారం ఉత్సాహంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించేందుకు ఒకరోజు ముందుగానే ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
సచివాలయ సిబ్బందితో కలిసి కూటమి నాయకులు వార్డుల వారీగా పర్యటించి, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ వక్ఫ్ బోర్డు జిల్లా కార్యదర్శి అమీర్, నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్ట్ మెంబర్ మరియు బిజెపి నాయకులు రాచూరి మురళి,బీజేపీ యువ నాయకులు వీరబల్లి జయకుమార్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ లక్ష్మి దేవి,తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యక్షులు సుదర్శన్,జనసేన కడప జిల్లా కార్యదర్శి (కార్యక్రమాల విభాగం) గురివిగారి వాసు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు నాగేంద్ర, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ తాటి సుబ్బరాయుడు, బీజేపీ మండల ఉపాధ్యక్షులు సివి సుబ్బయ్య, బీజేపీ మండల జనరల్ సెక్రటరీ రాజబోయిన మహేష్,జనసేన సీనియర్ నాయకులు రుద్ర లక్ష్మీకర్ రాజు, జనసేన యువ నాయకులు మనీష్ తదితరులు పాల్గొన్నారు.
