నల్లమలలోని శ్రీ సర్వ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ దర్శనం – అభివృద్ధి పనులపై హామీ

నంద్యాల జిల్లా కలెక్టర్ గారు కుటుంబసహితంగా మండల పరిధిలోని నల్లమల అడవిలోని శ్రీ లక్ష్మీ సర్వ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో జయ చంద్రారెడ్డి, రేచర్ల నాగేంద్ర దంపతులు, మహేష్, చిన్న, మధు తదితరుల ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో వేదమంత్రాల మధ్య ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ను ఆలయం పట్టు వస్త్రాలతో సన్మానించి, వేద పండితుల ఆశీర్వాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా టిడిపి యువ నాయకుడు రేచర్ల నాగేంద్ర ఆలయ అభివృద్ధి గురించి వినతి పత్రం కలెక్టర్‌కి అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ప్రధాన వసతులు, ధ్వజస్తంభం, ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అవసరమైన సౌకర్యాలు లేని పరిస్థితి ఉందని ఆయన వివరించారు. ప్రతివేళా సంక్రాంతి, పారువేట ఉత్సవాలు, స్వాతి నక్షత్ర వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.

వినతి పత్రం ద్వారా ఆగిపోయిన అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కి వినతి ఇవ్వబడింది. నంద్యాల జిల్లా కలెక్టర్ అటవీశాఖ అధికారులతో చర్చించి ఆలయ అభివృద్ధి పనులను కొనసాగించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe