తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలపై కేంద్ర జలశక్తిశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కేంద్ర జలసంఘం కార్యాలయంలో సమావేశమైంది. ఈ నెల 2న నీటి వివాదాల పరిష్కారానికి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జలసంఘం ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ అధికారులు, కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ, ఎన్‌డబ్ల్యూడీఏ ఛైర్మన్లు, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. నీటి పంపకాలతో పాటు వివిధ సమస్యలు, వివాదాలపై అధికారులు తొలిసారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
