నంద్యాల, జనవరి, 26.
( ఎల్లో సింగం ప్రతినిధి )
గణతంత్ర దినోత్సవంలో భాగంగా బనగానపల్లె మండలం నందివర్గం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పని చేస్తున్న ఎస్ మదన గోపాలకు సోమవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రౌండ్ మైదానంలో 77 వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ(IAS) చేతుల మీదుగా జిల్లా ఎస్పీ సునీల్ షరాన్(IPS) గారి సమక్షంలో ఈ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈకానిస్టేబుల్, క్రమశిక్షణ, అంకిత భావం, సమర్థవంతమైన పర్యవేక్షణకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈయనకు బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి, నందివర్గం ఎస్సై భూపాలుడు,సర్కిల్ ఆఫీస్ సిబ్బంది, నందివర్గం పోలీసులు అభినందనలు తెలిపారు.
