సమీక్షకు హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు.
వివిధ జిల్లాల్లో నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని సీఎం ఆదేశం.
రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచనలు ఇచ్చిన సీఎం చంద్రబాబు.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహా బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చేలా చూడాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.
స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు విధానం మేరకు తక్షణమే చర్యలు ఉండాలని సీఎం ఆదేశం.
రైతుల నుంచి చేసే కొనుగోళ్లలో మిల్లర్లు ఎక్కడా అక్రమాలకు పాల్పడకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించిన సీఎం చంద్రబాబు.
