డీసీసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండా ఆవిష్కరించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు అప్సర్ యూసుఫ్ జాహి
భద్రాద్రి కొత్తగూడెం జనవరి 26 (ఎల్లో సింగం ప్రతినిధి :
ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించాలని, అదేవిధంగా మహనీయులు మనకోసం, మన హక్కుల కోసం సృష్టించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలనిటీపీసీసీ ఉపాధ్యక్షులు, సంస్థాగత ఎన్నికల ఇంచార్జి అప్సర్ యూసుఫ్ జాహి అన్నారు. స్థానిక కొత్తగూడెం బస్టాండ్ ప్రాంతంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిందని, స్వతంత్ర భారతంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బ్రతకాలని ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహానీయులు రాజ్యాంగాన్ని రచించి మన ముందుకు తెచ్చారని, ఫలితంగానే ఈరోజు ఈ పాలన వ్యవస్థ కొనసాగుతుందని వెల్లడించారు. భిన్నత్వంలో ఏకత్వంగా సాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగ నిర్మాత అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని హక్కులను అందించారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటిని క్రోడీకరించి సరళమైన, కట్టుదిట్టమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భరతమాతను, భారతదేశాన్ని గౌరవిస్తూ ప్రతి పౌరుడు ముందుకు సాగి దేశ గౌరవాన్ని నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు టి దేవి ప్రసన్న, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు, టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి, కోనేరు సత్యనారాయణ (చిన్ని), జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ అల్లాడి నరసింహారావు, కొత్తగూడెం పట్టణ కన్వీనర్ ఎండి గౌస్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గడ్డం రాజశేఖర్, పట్టణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు కాజా బాక్స్, జిల్లా మైనార్టీ నాయకులు ఎండి ఆరిఫ్, మాజీ కౌన్సిలర్ తంగేళ్ల లక్ష్మణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎస్.కె నిస్సార్, ఆర్ నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.
