దావోస్‌లో ఇజ్రాయెల్‌ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు

ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇజ్రాయెల్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాజధాని అమరావతిని సైబర్‌ సెక్యూరిటీ హబ్‌గా అభివృద్ధి చేయడానికి సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్‌ బర్కత్‌, ట్రేడ్‌ కమిషనర్‌ రోయ్‌ పిషర్‌తో చర్చలు జరిపారు. విశాఖ–చెన్నై కారిడార్‌లో యూఏవీ డ్రోన్ల తయారీ, తీరప్రాంత గస్తీ, వ్యవసాయం, వ్యర్థ జలాల రీసైక్లింగ్‌ రంగాల్లో సహకారం కోరారు.

WhatsApp Join Now
Youtube Subscribe