తొమ్మిది నెలలుగా జీతాలు లేక ఏపీసీఓఎస్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన

విశాఖపట్నం జిల్లాలో APCOS ద్వారా నియమితులైన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు గత తొమ్మిది నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని కింగ్ జార్జ్ హాస్పిటల్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ తదితర సంస్థల్లో 2025 మే నెలలో చేరిన సుమారు 36 మంది ఉద్యోగులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని వారు వాపోతున్నారు. కుటుంబ పోషణ కష్టసాధ్యమైందని, అప్పులు చేసి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు కే ఈశ్వర్‌రావును కలిసి తమ సమస్యను వివరించారు. పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేసి, యాప్‌లో వివరాలు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe