విజయవాడ రూరల్, జనవరి 24 : విజయవాడ రూరల్ మండలం పి. నైనవరం గ్రామంలో స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సాధారణంగా ప్రతి నెల మూడవ శనివారం జరిగే ఈ కార్యక్రమాన్ని, ఈసారి పండుగ సెలవుల కారణంగా నాలుగవ వారంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజూ కొంత సమయం కేటాయించాలని, బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా అరికట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం యార్లగడ్డ మాట్లాడుతూ…, నైనవరం పాఠశాలలో పారిశుధ్యం సరిగ్గా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉండటం వల్ల ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా నున్న రోడ్డు సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. గత పాలకులు చేసిన తప్పులను తాను పునరావృతం చేయనని, ఈ గ్రామం సహా చుట్టుపక్కల ఉన్న తొమ్మిది గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ గ్రామం మున్సిపాలిటీలో కలిస్తేనే తాగునీటి సమస్య, చెత్త సమస్య తీరతాయని, రోడ్లు కూడా అభివృద్ధి చెందుతాయని వివరించారు. ఈ ప్రాంతంలో తాగునీటిలో TDS స్థాయి 3000 వరకు ఉండటంతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, నైనవరంలో 10 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు యార్లగడ్డ వెల్లడించారు. గ్రామంలోని రైస్ మిల్ బాయిలర్ వల్ల కలుగుతున్న కాలుష్యంపై ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడానని, అనుమతి లేని పక్షంలో దానిని వెంటనే నిలిపివేయిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాల సమస్య త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండల ఎంపీడీఓ విగ్గిన్స్, మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, పి. నైనవరం గ్రామ టిడిపి అధ్యక్షులు బెజవాడ రామకృష్ణ, గన్నవరం ఏఎంసీ డైరెక్టర్ సాతులూరి కోటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ భట్టా చిన్నబ్బాయి, అంబాపురం గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య, నియోజకవర్గ తెలుగుయువత ఉపాధ్యక్షులు చల్లగాలి సునీల్, గ్రామ టిడిపి ప్రధాన కార్యదర్శి చప్పిడి రమేష్, యూనిట్ ఇంచార్జి షేక్ నబి, కొల్లా ఆనంద్, ధూళిపాళ్ల దేవేందర్, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు అన్నంశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది గ్రామాల విలీనమే లక్ష్యం : ఎమ్మెల్యే యార్లగడ్డ
25
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
