తెల్ల తెల్లవారంగానే పెన్షన్ల లక్ష్మీ తలుపు తట్టింది.. ప్రతి ఇంట్లో పండగ తెచ్చింది.

▪️- చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు

  • గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారు ఆదేశాలతో ఒకరోజు ముందుగానే ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం తెల్లవారంగానే చీరాల నియోజకవర్గంలో ప్రారంభమైంది.
  • మన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు దేవి నూతల గ్రామంలో పెన్షన్ పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..

  • ఇంటింటికి వెళ్లారు తలుపు తట్టారు చంద్రన్న పంపారు మీకు ఒక రోజు ముందుగా పెన్షన్ ఇస్తున్నామని ప్రతి ఇంట్లో చిరునవ్వును చూశారు.
  • ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా 19 నెలల పూట మీ పాలనలో ఒకటవ తేదీ పెన్షన్లను ఇస్తున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ అధికమిస్తూ ప్రతి అవ్వ ప్రతి తాత చిరునవ్వుతో కూటమి పాలనలో ఆనందంగా ఉండాలన్న మన నేతల సంకల్ప దీక్షతో పెన్షన్ను పంపిణీ చేస్తున్నాం.
  • అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళుతున్నాం.
  • కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో మన చీరాల ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకునేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం.
  • మౌలిక సదుపాయాల కల్పన, ఇంటింటికి కులాయి ఏర్పాటు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కృషి జరుగుతుందన్నారు.
  • అదేవిధంగా నియోజకవర్గంలో కూడా గ్రామ గ్రామాన అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి దీవించండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జెండాను ఎగరవేదం. కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇద్దాం అని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో దేవి నూతల గ్రామ పార్టీ అధ్యక్షులు కొండలు గారు , AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్ , బూత్ ఇంచార్జ్లు, నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe