తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

తెలంగాణకు మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. చర్లపల్లి జంక్షన్‌–తిరువనంతపురం మధ్య ఈ సూపర్‌ఫాస్ట్ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లనుండటం ప్రయాణికులకు ప్రయోజనకరం. శుక్రవారం తిరువనంతపురంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ, ఏపీలో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. ఉదయం 10.45కు తిరువనంతపురం నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.30కు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా తెలంగాణకు మరో అమృత్‌ భారత్‌ రైలు కేటాయించినందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికే చర్లపల్లి–ముజఫర్‌పూర్‌ (బిహార్‌) మధ్య ఒక అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది. సుదూర ప్రయాణాలకు ప్రత్యేక సౌకర్యాలతో కేంద్రం ఈ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

WhatsApp Join Now
Youtube Subscribe