తృటిలో తప్పిన ప్రమాదం – భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఘటన

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ పోతినమలై పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో కొద్దిసేపటి క్రితం ప్రమాదం తృటిలో తప్పింది. మధురవాడ నుంచి వైజాగ్ నేషనల్ హైవే పై వెళ్తున్న ఈకో ప్యాసింజర్ వాహనం స్టేడియం సిగ్నల్ పాయింట్ వద్ద అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిలై అదుపుతప్పి పక్కన ఉన్న డివైడర్ (సిమెంట్ స్టాపర్లు) పైకి దూసుకెళ్లింది.

అదృష్టవశాత్తు వాహనంలో డ్రైవర్ ఒక్కరే ఉండటంతో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. వాహనం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ ఎస్సై విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

తక్షణ చర్యగా జేసిబి సహాయంతో వాహనాన్ని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. వేగవంతమైన స్పందనతో పెద్ద ప్రమాదం నివారించబడింది.

WhatsApp Join Now
Youtube Subscribe