విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓ రిటైర్డ్ లైన్‌మెన్ ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన పీ.ఎం.పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితుడు బొడ్డేటి అప్పలరాజు (62) ఈ నెల 2వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లి, 14వ తేదీ ఉదయం ఇంటికి చేరుకోగా తాళాలు పగులగొట్టబడినట్లు గుర్తించారు. ఇంట్లో పరిశీలించగా బీరువాలో భద్రపరిచిన సుమారు 21 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు దొంగలు అపహరించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న సీఐ బి.ఎస్.ఎస్. ప్రకాష్ పర్యవేక్షణలో ఎస్.ఐ. సూర్యప్రకాష్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తీర్థయాత్రకు వెళ్లి వచ్చేసరికి రిటైర్డ్ లైన్‌మెన్ ఇంట్లో భారీ చోరీ
14
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
