తిరుమ‌ల శ్రీవారిని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజయవాడ ఎల్లో సింగం రిపోర్టార్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్ర‌వారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) కుటుంబ సమేతంగా స‌తీమ‌ణి కేశినేని జాన‌కీ ల‌క్ష్మీ, కుమారుడు కేశినేని వెంక‌ట్, కుమార్తె కేశినేని స్నిగ్ధ ల‌తో పాటు టిడిపి నాయకుల‌తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తిరుమల చేరుకున్న ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొని, భక్తిశ్రద్ధలతో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు, సుఖ సంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకున్నట్లు వెల్లడించారు. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ,రైతులు, యువత, మహిళలు అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కూడా ఆయన ఆకాంక్షించారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి కొంతసేపు గడిపిన ఎంపీ కేశినేని శివనాథ్, తిరుమల శ్రీవారి దర్శనం తనకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
ఎంపీ కేశినేని శివ‌నాథ్ తో పాటు ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు క‌రీముల్లా, తెలుగుదేశం పార్టీ గంప‌ల గూడెం మండ‌లం అధ్యక్షుడు మానికొండ రామ‌కృష్ణ ( ఆర్.కె) ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe