తిరుమల పవిత్రతను దెబ్బతీసిన పార్టీ వైకాపా అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశమని తెలిపారు. సంక్షేమంలో ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైకాపా అని ఆరోపిస్తూ, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు. తిరుపతి–తిరుమల గౌరవాన్ని దెబ్బతీసిన వైకాపా, కల్తీ నెయ్యి అంశంలోనూ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి ఆరోపించారు.
తిరుమల గౌరవాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ వైకాపా: గొట్టిపాటి
31
Jan
WhatsApp
Join Now
Youtube
Subscribe
