ఎల్లో సింగం న్యూస్ హొళగుంద జనవరి29
తిరుపతి లడ్డు పాపం
వైఎస్ఆర్సిపి పార్టీని ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠ ప్రసాద్ లు అన్నారు ఈ సందర్భంగా ముందగా శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ
68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి
అది నెయ్యే కాదు!
పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం!
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ
జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ ఘీ ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారీ
వైసీపీ పెద్దలు రూ.251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారన్నారు పదార్థం: “సింథటిక్ చీ” (0% పాల కొవ్వు) (కూర్పు: పామ్ ఆయిల్ పామోలిన్ కెమికల్ ఎస్టర్స్)
వాల్యూమ్: 68,00,000 కిలోగ్రాములుu (2021-2024 సరఫరా చేయబడింది)విలువ: 250 కోట్లు (సుమారుగా మోసం విలువ)గోవిందా … పాలు లేకుండా నెయ్యి తయారీగతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుపతిలో జరిగే కల్తీ లడ్డు వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేశాతన్నారు నాడు తెలుగుదేశం పార్టీ చెప్పినట్లు గానే.. నేడు సుప్రీం కోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు నిగ్గు తేల్చిందన్నారు
నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారికి ప్రసాదాలు తయారు చేశారని ఎస్ ఐ టి దర్యాప్తు, ఛార్జ్ షీట్ ల ద్వారా బట్టబయలైంది… వైసీపీ నేతలు ఏం సమాధానం చేపుతారు అని ఎద్దేవా చేశారు
దేవదేవుడి ప్రసాదం విషయంలో జరిగిన ఈ మహా కల్తీ గుట్టు రట్టయిందన్నారు “మేము ఏ తప్పూ చేయలేదు” అని అన్న వైసీపీ నాయకుల ముఠా ఇప్పుడు ఏమంటారు? అని వారు ప్రశ్నించారు
కనీసం చుక్క పాలు లేకుండా పూర్తిగా రసాయనాలతో ‘నెయ్యి’ తయారు చేసి కోట్లాది లడ్డూలు సరఫరా చేశారు. ఇలాంటి అభూత ‘ఇన్నోవేషన్’కు వైసీపీ ముఠాకు నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాల్సిందే అన్నారు
తల్లిపాలు కూడా కల్తీ చెయ్యగల దుర్మార్గులు
తప్పు లేదని చెప్పేవారు ఎందుకు యాంటీసిపేటరీ బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు? కల్తీ నెయ్యి గురించి ఎవరు మాట్లాడకూడదని కోర్టు నుంచి ఎందుకు ఆదేశాలు తెచ్చుకున్నారనీ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వడానికి ఎందుకు తిరస్కరించారన్నారు
నెయ్యి కల్తీ చేయలేదు, స్వామివారికి ద్రోహం చేయలేదు” అని ప్రమాణం చేయగలరా? వైసీపీ ఐదేళ్ళ పాలనలో మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా, అందులో 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యితో 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారుచేశారన్నారు.చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాల్లో 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లలో రూ.4.69 కోట్లు జమ కాగా అందులో రూ.4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్ళించారన్నారు ఎవరి ఖాతాలకు పంపాడు ఏ మాత్రం పలుకుబడి లేని ఓ సామాన్య వ్యక్తి డెయిరీలను బెదిరించి నెయ్యి కి కమిషన్ వసూలు చేసి నకిలీ నెయ్యి సరఫరా చేసినా దాన్ని ప్రసాదం వరకూ ఎలా పంపగలడు? అధికారులను బలి చేయడం వైసీపీకి అలవాటే అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు గోవిందు గౌడ్ ,రాజేంద్ర గౌడ్, భువనేష్ గౌడ్, సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ శేషగిరి, యువ నాయకులు మోయిన్, ఆదాం,గిరి,వలి,షాలి అమాన్,ఎల్లార్తి మల్లికార్జున, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు
