తితిదే ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బదిలీ

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు తితిదే ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్‌కుమార్‌ సింఘాల్‌ జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. 1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సింఘాల్‌ గతేడాది సెప్టెంబరులో రెండోసారి తితిదే ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.

WhatsApp Join Now
Youtube Subscribe