తానంకి నానాజీ జన్మదిన వేడుకల్లో శుభాకాంక్షలు తెలిపిన పేపళ్ల అమరయ్య నాయుడు

తానంకి నానాజీ జన్మదిన సందర్భంగా చిల్లకూరులోని వారి నివాసంలో ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు పేపళ్ల అమరయ్య నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానాజీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఆయనకు మరియు వారి కుటుంబ సభ్యులకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కార్యక్రమంలో కోనేరు రాంబాబు, సద్దాం హుస్సేన్, మోహన్ చౌదరి, భాస్కర్ తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించబడ్డాయి.

WhatsApp Join Now
Youtube Subscribe