టీడీపీ సీనియర్ నాయకుడు బొచ్చుల సోమయ్యకు అశ్రునివాళి – కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండ

బొచ్చుల వారి పాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు శ్రీ బొచ్చుల సోమయ్య గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకుడిని పార్టీతో పాటు సమాజం కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాలకొండయ్య గారు బొచ్చుల సోమయ్య గారి నివాసానికి వెళ్లి, వారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్టసమయంలో పార్టీ తరఫున రూ.50,000 ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించిన ఆయన, బొచ్చుల సోమయ్య గారి సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయే నాయకుడిగా ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Youtube Subscribe