మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సీఎం చంద్రబాబు పై అంబటి రాంబాబు మురికి మాటలతో దూషించిన నేపథ్యంలో, అదే బాటలో జోగి రమేష్ మంత్రి నారా లోకేశ్‌పై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ‘‘తెదేపా కల్తీ నాయకత్వంలో నడుస్తోంది. లోకేశ్‌కు చిప్ దెబ్బతింది’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ అంశాన్ని ప్రస్తావిస్తూ సిట్ ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని అన్నారు. ఇబ్రహీంపట్నం ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం మీడియాతో మాట్లాడిన జోగి రమేష్, తెదేపా నేతలపై పలు విమర్శలు గుప్పించారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
