జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా అంధత్వ నివారణ సంస్థ

రంపచోడవరం ఫిబ్రవరి 6(ఎల్లో సింగం ప్రతినిధి):ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పాఠశాల విద్యార్థుల ఉచిత కంటి పరీక్ష మరియు కంటిఅద్దాలు పంపిణీ కార్యక్రమం లో భాగంగా పోలివరం జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి శ్రీమతి Dr. సరిత వారి ఆదేశాల మేరకు నేడు PHC వాడపల్లి వైద్యాధికారి Dr. చరిష్మా గారి ఆధ్వర్యంలో P. HC. నరసాపురం ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ పోతుల. శ్యామ్ కుమార్ , ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల బందపల్లి ప్రధానో పాధ్యాయులు మరియు సిబ్బంది సమక్షంలో విద్యార్థులకు కళ్ళ జోళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్తులు సకాలంలో దృష్టిలోప నివారణకొరకు సూచించిన కంటి అద్దాలు వాడటం, మంచి పోషకాహారం తీసుకోవడం మరియు చరవాణి వంటివి వాడకుండా ఉండడం ముఖ్యమైన అంశాలని , తప్పక పాటించి అంధత్వం బారిన పడకుండా ఉండాలని అవగాహన కల్పించారు.

WhatsApp Join Now
Youtube Subscribe