విశాఖపట్నంలో జర్నలిస్టు వర్గాల్లో గంట్ల శ్రీనుబాబు వ్యక్తిత్వం మరోసారి చర్చనీయాంశమైంది. “ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా నేనున్నాను” అంటూ జర్నలిస్టు సోదరులకు, సోదరీమణులకు ఆయన ఇచ్చిన భరోసా ప్రశంసలు అందుకుంటోంది. యూనియన్లు, వర్గాలకు అతీతంగా జర్నలిస్టు అన్న ఒక్క మాటకే స్పందించే మహోన్నత మనసు ఆయనదని సహచరులు పేర్కొంటున్నారు. కష్టసమయాల్లో జర్నలిస్టులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొనే ఆర్థిక, నైతిక, వైద్య సమస్యల పరిష్కారంలో ముందుండి సహాయం అందించడం ఆయన సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. మాటల్లో కాకుండా చేతల్లో మానవత్వాన్ని చూపించడం ఆయన ప్రత్యేకతగా అభివర్ణిస్తున్నారు. జర్నలిస్టుల మధ్య ఐక్యతను పెంపొందించడంలో, అవసరమైనప్పుడు స్వయంగా ముందడుగు వేసి సహకారం అందించడంలో గంట్ల శ్రీనుబాబు పాత్ర విశేషమని పలువురు అభిప్రాయపడుతున్నారు. “ఆపదలో అండగా నిలిచేవాడే నిజమైన మనిషి” అనే నిర్వచనానికి ఆయన నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారని జర్నలిస్టు సమాజం కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తోంది.
“జర్నలిస్టులకు అండగా గంట్ల శ్రీనుబాబు భరోసా – ‘ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా నేనున్నాను’”
20
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
