విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం లాస్యన్స్ బే కాలనీలోని భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు ఎం ఎన్ ఎన్ పరశు రామ రాజు ఆధ్వర్యంలో బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి ఎస్ వి ఎస్ ప్రకాష్ రెడ్డి మరియు జివిఎంసి ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ప్రతి శుక్రవారం ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారని, ఉత్తరాంధ్ర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జనతా వారధి కార్యక్రమంలో వినతులు స్వీకరించిన ఎస్‌వీఎస్ ప్రకాష్ రెడ్డి
14
Feb
WhatsApp
Join Now
Youtube
Subscribe
