జంతువుల సంరక్షణ అందరి భాద్యత

  • జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర్ రెడ్డి

పార్వతీపురం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 2 (ఎల్లో సింగం)

జిల్లాలో జంతువులపై జరుగుతున్న హింసనుఅరికట్టేందుకు అధికారులు కఠినంగావ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా జంతుహింస నివారణ సంఘం కార్యవర్గ సమావేశానికిఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగాకలెక్టర్ మాట్లాడుతూ గోశాల నిర్మాణానికి సత్వరచర్యలు చేపట్టాలని, పశువులను నిబంధనలకువిరుద్ధంగా వాహనాల్లో కిక్కిరిసి తరలించడంచట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అక్రమరవాణా పై నిఘా పెంచాలి, జిల్లా సరిహద్దుల్లోతనిఖీలను ముమ్మరం చేయాలని పోలీసుమరియురవాణాశాఖఅధికారులనుఆదేశించారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితేవాహనాలను సీ చేయడంతో పాటయజమానులపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని సూచించారు. జిల్లాలో అనాథగాతిరుగుతున్న మరియు గాయపడిన జంతువులుసంరక్షణ కోసం ప్రత్యేక షెల్టర్ హోమ్లనుఏర్పాటు చేయాలని పశుసంవర్ధక శాఖజిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డిఅధికారులకు కలెక్టర్ సూచించారు. అలాగే,వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జంతువులుకోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలనిమున్సిపల్ అధికారులకు తెలిపారు. జంతు హింసనివారణ చట్టం-1960 పై ప్రజల్లో విస్తృతఅవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు.పెంపుడు జంతువులను వదిలివేసే వారిపై, వాటినిహింసించే వారిపై జరిమానాలు విధించాలనికమిటీ సభ్యులకు సూచించారు. జంతు ప్రేమికులు మరియు స్వచ్ఛంద సంస్థలను ఈకమిటీలో భాగస్వాములను చేసి, క్షేత్రస్థాయిలోపటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా అవగాహ కార్యక్రమాలునిర్వహించాలని జిల్లా పశు సంవర్ధకశాఖాధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలోఎఎస్పి మనీషా రెడ్డి, జిల్లా పశు సంవర్ధకశాఖాధికారి మన్మధ రావు, డిఆర్డిఎ ప్రాజెక్ట్అధికారి సుధారాణి, ఆర్టిఓ దుర్గా ప్రసాద్ రెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు,.మునిసిపల్ కమీషనర్ డా డి పావని, మెప్మా పి.డి కృష్ణా రావు, కమిటీ సభ్యులు మరియు వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe