ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గారి తనయుడు, యువ నాయకుడు మద్దులూరి గౌరీ అమర్నాథ్ హాజరై ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేశారు.
మొత్తం 43 పైగా అర్జీలు అందగా, వాటిలో ఇంటి నిర్మాణాలు మరియు ఇంటి స్థలాల కోసం 26, పింఛన్లకు సంబంధించి 13, ఇతర పలు సమస్యలపై 4 అర్జీలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి అర్జీని శ్రద్ధగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించనున్నట్లు గౌరీ అమర్నాథ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ కౌతువరపు జనార్ధన్, చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, టీ నాగేశ్వరరావు, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారానికి వేగం పెరుగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
