చిరంజీవి–రజినీకాంత్ కాంబినేషన్‌లో మిస్ అయిన సినిమా ఇదే!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ఘన విజయం అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి సినిమాలపై ఆసక్తికరమైన ఓ విషయం మరోసారి చర్చకు వచ్చింది.

నాలుగు దశాబ్దాలుగా సినీ రంగాన్ని శాసిస్తున్న చిరంజీవి, రజినీకాంత్ ఇప్పటివరకు కలిసి నటించిన సినిమా ఒక్కటైనా రాలేదు. అయితే ఒకసారి ఈ సూపర్ స్టార్ కాంబినేషన్ తెరపై కనిపించే అవకాశం వచ్చి కూడా చేజారిపోయిందట. ఆ సినిమా మరేదో కాదు… రంగేళి. ఈ ప్రాజెక్ట్‌లో చిరంజీవి–రజినీకాంత్ కలిసి నటించాల్సి ఉండగా, నిర్మాత అశ్వినీదత్ కారణంగా ఆ అవకాశం మిస్ అయిందని సమాచారం. ఆసక్తికరంగా, అదే సినిమా హిందీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

WhatsApp Join Now
Youtube Subscribe