2026 జనవరి 22న గుంటూరు మిర్చి మార్కెట్కు 61 వేల బస్తాల కొత్త మిర్చి భారీగా వచ్చింది. సరుకు ఎక్కువగా రావడంతో తేజా, షార్కు తేజా, రోమి వంటి రకాల ధరల్లో స్వల్ప ఒడిదుడుకులు కనిపించాయి. అయితే డీడీ 341, నాటు, సీడ్, బ్యాడిగి వంటి రకాలపై డిమాండ్ కొనసాగి ధరలు స్థిరంగా ఉన్నాయి.
నాణ్యత ఉన్న సరుకులకు మంచి ధరలు పలికాయి. కొన్ని వెరైటీలు ఇప్పటికే క్వింటాలుకు రూ.25,000 దాటగా, డీలక్స్ రకాల ధరలు రూ.30,000 పైకి వెళ్లాయి. సాగు విస్తీర్ణం తగ్గడం, తెగుళ్ల ప్రభావం వల్ల దిగుబడి తగ్గడంతో రాబోయే రోజుల్లో మిర్చి ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
WhatsApp
Join Now
Youtube
Subscribe
